
నీవు లేక నిమిషమైన
నీవు లేక నిమిషమైన - బ్రతుకలేను నా యేసయ్యా ఈ ఎడారి జీవితములో - దాహముతీర్చెడి ఉఊటవు నీవే నను నడిపించె మేఘము నీవే నా అంగలార్పును - నాట్యముగ మార్చి సంతోష వస్త్రమును - ధరింపజేసితివి ఉత్సాహధ్వనులతో - ఇంపుగ వాయించి నూతన కీర్తన నేపాడెదా నే పాడిన పాట - రాత్రివేళలో నా హృదయమునందు - ధ్యానించుకొనగా పూర్వము చేసిన ఆశ్చర్యకార్యములు తలంచుకొనుచు నే బ్రతికెదా నా తల్లి గర్భమునుండి - ఉద్భవింపచేసితివి బాల్యము నుండి - ఆశ్రయమైతివి వృద్ధాప్యమందు విడువనివాడవు తరువాత మహిమలో నను చేర్చుకొందువు


Follow Us