LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీవే కృపాధారము త్రియేక దేవా


నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా
నూతన బలమును నవ నూతన కృపను
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా 

ఆనందించితిని అనురాగబందాల - ఆశ్రయపురమైన నీలో నేను
ఆకర్షించితివి ఆకాశముకంటే - ఉన్నతమైన నీ ప్రేమను చూపి
ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్ని జ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా - ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా

సర్వకృపానిధి సీయోను పురవాసి - నీ స్వాస్త్యముకై నను పిలచితివి
సిలువను మోయుచు నీ చిత్తమును - నెరవేర్చెదను సహనము కలిగి
శిధిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నవు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా

ప్రాకారములను దాటించితివి - ప్రార్ధనవినెడి పావనమూర్తివి
పరిశుద్ధులతో నను నిలిపితివి - నీ కార్యములను నూతన పరిచి
పాపనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words