LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీవే నా సంతోషగానము


నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2)        ||నీవే నా||

ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్

త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2)        ||నీవే నా||

వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2)        ||నీవే నా||

నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2)        ||నీవే నా||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words