
అమూల్యమైన ఆణిముత్యమా
అమూల్యమైన ఆణిముత్యమా యెహోవ దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశివి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు ఇంటివారిని బాగుగ నడుపుచూ వారి మన్ననలను పొందుచుందువు చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రివేళ నీ దీపము ఆరదు కాంతికిరణమై మాదిరి చూపుదువు దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు


Follow Us