
నూతన గీతము నే పాడెదా
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవుచూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధమెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవేనా ప్రాణమూ- నిను వీడి నెనుండలేనూ కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ - నీకృపయే ఆధారమూ మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీమహిమయే నాగమ్యమూ


Follow Us