LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నూతన యెరుషలేమ్ - దిగి


నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 

శోభ కలిగిన - ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము - కానిదియే -2
బహు సహస్రముల - సూర్యుని కంటె -2  
ప్రజ్వలించుచున్నది - మహిమవలెను
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

పరిపూర్ణమైన -సౌందర్యమును .
పృథ్వికి - ఆనందముగాను -2 
భూరాజులందరు - మహిమ తెచ్చెడి -2  
మహిమగల నగరము – ఇదియే
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

ధగధగ మెరయు - సూర్యకాంతం వలె  
జ్వలించుచున్న- దైవనగరమందు -2  
నీతిమంతులే - సూర్యునివలెను -2  
నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words