LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నే సాగెద యేసునితో


నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా            ||నే సాగెద||

వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా             ||నే సాగెద||

లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద||

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా             ||నే సాగెద||

తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా    ||నే సాగెద||



Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words