
నేనెందుకని నీ సొత్తుగా
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ 1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె" 2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె" 3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును


Follow Us