
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) ఇచ్చిన నీవే బలి కోరగా (2) తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా (2) ఆప్తులంతా శత్రువులైనా (2) అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే (2) ఇదిగో నేను ఉన్నానయ్యా (2) దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||


Follow Us