
న్యాయాదిపతియైన దేవుడు
న్యాయాదిపతియైన దేవుడు - నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో - యోచించుకో ఓ క్రైస్తవా ఆకలితో వెదనొందగా - దాహముతో తపియించగా - రోగముతో కృశియించగా నన్ను చేర్చుకొనలేదు - నీ వెందుకు అని యేసు, నిన్ను అడిగిన యేమందువో! గోర్రెలనే నీతిమంతులు - మేకలనే పాపాత్ములు - మందలగా విభజించినా ఈ రెండింటిలో నీది - ఏస్థానము అని యేసు - నిన్నడిగిన ఏ మందువో గొర్రెలకే నిత్య జీవము - మేకలకే నిత్య నరకము - ప్రతిఫలముగా నొసగెనుగా ఈ రెండింటిలో నీది - ఏ స్థానము అని ఏసు నిన్నడిగిన ఏమందువూ


Follow Us