
పరదేశి ఓ పరదేశి
పరదేశి ఓ పరదేశి - ఎటుచూచిన ఎడారులే - ఎందుబోయినా ఎండమావులే - ఏనాటికైనా - నీకాయము - మాయమగుటే ఖాయం ఏనాటికైనా ఏసయ్యను చేరుకొనుటే న్యాయం ఏసు రక్తమే జయము - సిలువ రక్తమే జయము కట్టుకున్న భార్యా నీ పై కుప్పులా కూలినా - కన్నబిడ్డలా కన్నీరు ఏరులైపారినా - అన్నదమ్ములే నీకై అలమటించినా - కలవరించినా బంధువులంతా బ్రతిమాలినా - ఆత్మీయులే అడ్డగించినా ఫ్యాక్టరీలువున్నా మోటారుకారు లెన్ని వున్నా - పొలాలెన్ని వున్నా ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా- అందగాడివైనా - ఆటగాడివైనా - అందని మాటకారివైనా - సిపాయివైనా - కసాయివైనా - బికారివైనా ఏకాకివైనా తెల్లవాడినైనా - తెలిసిన నల్లవాడివైనా - నాయకత్వమున్నా - యెంతటి ప్రేమ తత్వమున్నా - విద్యావేత్తవైనా - తత్వవేత్తవైనా - ఎంతటి శాస్త్రవేత్తపైనా తీయిషువైనా - ఎతిష్ణువైనా - కోపిష్టువైనా - ఏ యిషువైనా


Follow Us