
పరలోక దేవుని పిల్లలం
పరలోక దేవుని పిల్లలం - మేము భారతీయులం ఆరని జీవన జ్యోతులం - విశ్వాస వీరులం హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా పాత రోత బ్రతుకులన్ విడచిన వారం నూతన జన్మము నొందినవారం పరిశుద్ధాత్మను పొందినవారం ప్రభు యేసు సువార్తను చాటెడివారం అందచందము లేనివారం అందమైన యేసుని పొందినవారం ఆత్మల భారం కలిగినవారం ఆత్మీయనాధుని చాటెడివారం కల్వరినాధుని పిల్లలం మేము కాంతులను వెదజల్లెడివారం సాతాను యుక్తుల నెరిగినవారం సాతాను రాజ్యం కూల్చెడివారం యేసు కార్చెను రుధిరం - కల్వరిగిరిలో ప్రాణంబెట్టెన్ పాపీ నీ కొరకై పాపశాపమున్ తొలగించె యేసు యేసు పాదాల చెంతకు వేగము రండి


Follow Us