LOADING


Pastor Rajesh Ipc
Menu
    Close
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పరలోకము నా దేశము


పరలోకము  నా  దేశము - పరదేశి నేనిల
మాయలోకమేగా - నేను యాత్రికుడను

ఎంతో అందమైనది పరలోకము - అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును

దూతలు పాడుచుందురు పరమందున - దివారాత్రములందు
పాడుచుందురు - పావనుని జూచి నేను హర్షింతును నిత్యము

రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ - వీక్షించెదనెప్పుడు నాదు ప్రియుని
కాంక్షించెద నా మదిలో ఆయన చెంత నుండ

అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్ - అగుపడుచున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను పరిశుద్దు లెల్లరిన్

నిత్యానంద ముండును పరమందున - నీతి సమాధానము ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words