
పరవశించుచున్నది నా మదియెంతో
పరవశించుచున్నది నా మదియెంతో నీవు చేయు క్రియలు నేను చూచినపుడు ఆ... హా... హా ఆనందించెదను తేజో నివాసులతో చేరి సంతోషించెదను ఇంతవరకు నేను చూడలేదు ఎన్నడూ ఇంత మహా అద్భుతకార్యములు నీ శక్తి నీ బలము ఎంతో గొప్పవి కరతాళధ్వనులతో నిన్ను స్తుతియింతును బలమైన దేవుడా పరాక్రమశాలి నీ ముందు ఏది నిలువగలదు దేవా నీ బల కార్యములు చాలా గొప్పవి నా ప్రాణాత్మదేహముతో నిన్ను ఘనపరతును సర్వశక్తిమంతుడా నీకు సములెవ్వరు వీరాధిపీరుడా పరాక్రమ ధీరుడా నీ ఘనకార్యములు ఎంతో గొప్పవి ఇహమందు పరమందు నిన్ను ఆరాధించెదను


Follow Us