LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పరవాసిని నే జగమున


పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా - నీదరి నే చేరెదను - నేను

లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులను కొంటి
అంతయు మోసమేగా - వ్యర్ధము సర్వమిలలో - ఇలలో

ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకములో
పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే - నేను

తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో
తెలుపుము ఎంతల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను

ఆదినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణా  పొందితివనగా - మహిమానందము కలిగి - నాలో

యాత్రికుడనే నీలోకములో - సిలువ మోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగా - పొందితి నేను యేసుని - నేను

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words