
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా (2) సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పడే దిగిరమ్మయా (2) నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా (2) యేసుతో ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయ్యా (2) నన్ను యేసువలే మార్చుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయ్యా (2) తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయ్యా (2) నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా (2) నీతోనే ఉండాలని నీతో ఏకం కావాలని నా ఆశయ్యా నాతో సదకాలం ఉండుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా సత్యములో నడవాలని సత్యం నాకు తెలియాలని నా ఆశయ్యా (2) సర్వసత్యములో నడుపుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా (2)


Follow Us