
పర్వతములు తొలగిన
పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదంటివే నా యేసయ్యా విడిచి పొందంటివే యేసయ్యా నా మెస్సయ్యా నీవే నా మంచి కాపరివయ్యా సుడిగాలి వీచినా సంద్రమే పొంగిన అలలే అలజడిరేపిన నను కదలనియ్యక సత్యమునందు నన్ను ప్రతిష్టించి సీయోను కొండ వలే నన్నుమార్చితివి ధరణి దద్దరిల్లిన గగనం గతి తప్పిన తారాలన్ని రాలిపోయినా నేను చలించనులే స్థిరమైన పునాది నీవై నిలకడగా నిలిపితివి కుడిపక్కన నీవుండగ నేనెన్నడు కదలనులే మరణమైన జీవమైన ఉన్నవైన రాబోవునవైన సృష్టింపబడినదేదైనను నీ ప్రేమను ఆర్పలేవు నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను బలపరచితివి నిరంతరం నీతో కలసి సీయోనులో నిలచెదను


Follow Us