
పాడనా మౌనముగానే
పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును (2) నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నియు (2) నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| నా ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును (2) నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||


Follow Us