
అయ్యా నా కోసం కల్వరిలో
అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొతా కొండపై పడిపోయిన యేసు నా కొరకు తిరిగి లేచితివి అనాథ నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానును అప్పగించితివి


Follow Us