
పొర్లి పొర్లి పారుతుంది
పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వరిలో యేసు స్వామి రుధిరమది రుధిరమది, రుధిరమది, రుధిరమది, రుధిరమది నిండియున్న పాపమంత కడిగివేయును రండి మునుగడిందు - పాప శుద్ధి చేయును చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి కాళ్ళు చేతుల్ ప్రక్క నుండి ఊరే ఊటలు అవి కల్మషంబు - కడిగే క్రీస్తు రక్తధారలు రక్తము చిందించకుండ - పాపము పోదు ఆముక్తి దాత రక్తమందే - జీవము గలదు విశ్వ పాపమంత మోసె యాగ పశువిదే కొని చీల్చి నదియే పారె యేసు రక్తము చిమ్మె చిమ్మె దైవ గొట్టె పిల్ల రుదిరము రమ్ము రమ్ము ఉచితము - ఈ ముక్తి మోక్షము


Follow Us