
ప్రభు మొరవినవా
ప్రభు మొరవినవా - ప్రభు మొరవినవా నీ కొరకే నే వెదకెను దేవా - నా కొకసారి కనుపింప రావా నాదు ప్రాణము - తల్లడిల్లగ భూదిగంతముల నుండియెగా మొర్ర పెట్టుచుంటి నీకేగా యెక్కలేని ఎత్తయిన కొండ - ఎక్కించుమునన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభు నీమోము చూడ మిత్రుడా - నా ఆశ్రయమీవె - శత్రువులయెడ నా కోట నీవె స్తుతికి కారణభూతుడ నీవె వెగటు గలిగే - ఈ లోకమేగా - యుగయుగాలు నీతోనుండగా నీ గుడారములో నుందునుగా దేవా నాదు మొక్కులు నీవు దయతో నంగీకరించినావు భక్తుల స్వాస్థ్యం బిచ్చినావు రాజునకు దీర్ఘాయువు నిచ్చి - అతని సంవత్సరము లెచ్చించి రాజునే తరతరము లుంచితివి నిరతమతడు దైవ సన్నిధిని - నిలచునట్లు కాపాడుటకై నియమించితివి - కృపా సత్యములు


Follow Us