LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ప్రభుయేసుని పూజించెదం


ప్రభుయేసుని పూజించెదం - అనుదినము ఘనపర్చెదం
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి - సంతోషముగా ఉండెదం
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయా హల్లెలూయ


జీవమైన యేసు మనకు ఉన్నాడు - జీవజల రుచులు మనకు చూపాడు
మన పాపం తీశాడు - మనశ్శాంతినిచ్చాడు
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ

మేలులెన్నో చేయువాడు మన ప్రభువు
బాధలన్నీ దీయువాడు మన ప్రభువు
ఈలాటి ఈ ప్రభువు - మరిలేడు ఈ భువిలో
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ

ఆరిపోయిన దివిటీలు వెలగాలి - అందరు ఆత్మతో నిండాలి
ఏఝామో ఏ ఘడియో - రారాజు రానుండే
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ

ప్రియులారా రక్షణలో సాగండి - పరలోక రాజ్యంలో చేరండి
త్వరలోనే ప్రభుయేసు - రారాజై రానుండే
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words