
ప్రభువా నీ కలువరి త్యాగము
ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే|| ప్రభువా || నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2 లోకములోనుండి ననువేరు చేసినది నీదయా సంకల్పమే - 2|| ప్రభువా || జీవపు వెలుగుగ నను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2 శాశ్వత రాజ్యముకై నను నియమించినది నీ అనాది సంకల్పమే - 2|| ప్రభువా || సంపూర్ణునిగా నను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2 పరిపూర్ణ శాంతితో నను కాచుటయే నీ నిత్యసంకల్పమే - 2


Follow Us