
ప్రభువా నీలో జీవించుట
ప్రభువా నీలో జీవించుట -2 కృపాబాహుళ్యమే నా యెడ - కృపాబాహుళ్యమే -2 ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే - పెను తుఫానులన్నియు -2 సమసిపోవునే - నీ నామ స్మరణలో -2 సంతసమొందే - నా మది యెంతో -2 ప్రభువా నీలో జీవించుట..... పాప నియమమును - బహు దూరముగా చేసి -2 పావన ఆత్మతో - పరిపూర్ణమై -2 పాదపద్మము - హత్తుకొనెదను -2 ప్రభువా నీలో జీవించుట..... నీలో దాగినది - కృప సర్వోన్నతముగా -2 నీలో నిలచి - కృపలనుభవించి -2 నీతోనే యుగ - యుగములు నిల్చెద -2 ప్రభువా నీలో జీవించుట.....


Follow Us