
ప్రయాసపడి భారము
ప్రయాసపడి భారము మోయు ఓ జనులారా - రండి రండి వేగమే రండి త్వరపడి రారండి ప్రభుయేసుని చూడగ రండి - మీ భారము తీరును రండి హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా గొల్లలు జ్ఞానులు ఏతెంచి - పశుపాకలో శిశువును గాంచి - ఆరాధించిన అనుభూతి - మీకును ప్రాప్తించునురండి - మీ భారము తీరును రండి హల్లెలూయా యేసును యెవరో చూడాలని - ఆశించిన అ జక్కయ్యను - దర్శించి మరి రక్షించి - మిమ్మును రక్షించును రండి - మీ గృహమును దర్శించును రండి హల్లెలూయా రక్షణ కారణమేసయ్యగా - కొనసాగించెడి వాడాయనే - ఆయనవైపే జూచుచూ - పందెములో పాల్గొనరండి - గురియొద్దకే పరుగిడి రండి


Follow Us