
ప్రాణేశ్వర
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర|| నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2) నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర|| నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2) జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) ||ప్రాణేశ్వర|| కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2) కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర||


Follow Us