
ప్రేమా అనే మాయలో
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి కన్న వారి కలలకు దూరమై కష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా|| తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని (2) రక్తము చెమటగా మార్చుకొని నీ పైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – (2) ||కన్న|| ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోక ఆశలు హత్తుకొని (2) యేసయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని నీవు జీవిస్తే – తనువు చాలిస్తే నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని – (2) కొన్న తండ్రి కలలకు దూరమై కష్టాల కోడలికి చేరువై (2) ||ప్రేమా||


Follow Us