
ప్రేమా పూర్ణుడు
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడెదన్ – కొనియాడెదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా వెల కట్టలేని కలువరిలో ప్రేమ వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ


Follow Us