LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


బండ సందున పావురమా


బండ సందున పావురమా - పేటు బీటుల పావురమా
ప్రియుడు నిన్ను కోరినాడు - భీతి చెందకుమా 
వరుడు నిన్ను కోరినాడు - కలత చెందకుమా

సిద్ధపడుమా - ఓ సంఘమా - క్రీస్తు వచ్చు వేళాయే - వేచి యుండుమా - యేసువచ్చు వేళాయే - లేచి యుండుమా 

ప్రియుడు నిన్ను కోరెను - నీ వరుడు నిన్ను కోరెను - నీ స్వరము
వినిపించుమా - నీ ముఖము చూపించుమా 
ఏసు రాజు దిగువచ్చు వేళ - నీవు సంసిద్ధమా - నీవు పరిశుద్దమా

కొండ పేటు లందున - బండ బీటులందున - నీగూడు
నిర్మింపుమా - నీ ప్రియునికై చూడుమా 
లోక ఆశలు నీకేలనమ్మా - సిద్దె వెలిగించుమా - సిద్ధముగ నుండుమా

సాగరాలు పొంగినా - నింగి నేల కూలినా - భయమేల ఓ
సంఘమా - దిగులేల ప్రియ సంఘమా - బండ క్రీస్తే
నీ యండనుండ - గీతములు పాడుమా - నీ ప్రియుని వీక్షింపుమా

ద్రాక్ష చెట్లు పూత పట్టి - వాసన నిచ్చుచున్నవి - చలికాలమే గడిచెనమ్మా
నిదురేల నీ వింకలెమ్మ - వరుడు యేసు దిగివచ్చు వేళ తరుణమే తెంచెనమ్మా - నీ ప్రియుని సంధించుమా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words