
అలల పైనే నడచినా
అలల పైనే నడచినా నాదు యేసయ్యా- ఆదు కోవయ్యా .. గలిబిలిని నా కలవరములను - తొలగచేసిన కలుషహరుడా నాదు యేసయ్యా... ఆదు కోవయ్యా... నాదు యేసయ్యా శుద్ధుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయన మైతిని ప్రొద్దుపోయెను భయము లాయెను - ఉద్ధరించగ స్వామి రావా నట్టనడి సంద్రాన రేగెను- అట్టహాసపు పెనుతుఫాను గట్టుచూడగా చాల దూరము - ఇట్టి శ్రమలలో చిక్కు కొంటిని అలలు నాపై విసరి కొట్టగా - నావ నిండుగా నీరు చేరెను బ్రతుకులెంతో భారమాయెను - రేవు చేరే దారి లేదా మాట మాత్రపు సెలవు చేత - సూటిగా అద్భుతములెన్నో చాల చేసిన శక్తి మంతుడా - జాలి చూపి మమ్ము బ్రోవుమా చిన్న జీవిత నావ నాది - నిన్నేగురిగా పయనమైతిని ఎన్నోశోధన లెన్నో భయములు - కన్నతండ్రి కానరావా


Follow Us