
బలమైన దుర్గము నీ నామం
బలమైన దుర్గము నీ నామం అందులో నివసించుటయే సురక్షితం ఎవ్వరూ కదిలించలేనిది - ఎవ్వరూ జయించలేనిది నిత్యము స్థిరముగా స్థిరపరచితివే ఈ లోక రాజులు దుర్గములు కట్టించి గర్వించి చూపించెనే గాని సుడిగాలికి కదిలెనే - స్తుతి ధ్వనులకు కూలెనే దేవా నివాసులకు - దుర్గములు స్థాపించి కృపచూపి దయచేసితివే అవి రక్షణ కవచమే - అది ఆత్మాభిషేకమే దేవా నీ పాలనలో - దుర్గములు నిర్మించి శుద్దులకిచ్చితివే అవి అనంద నగరమే - అది అక్షయ రాజ్యమే


Follow Us