
బలమైన దేవుడవు నీవే యేసయ్యా
బలమైన దేవుడవు నీవే యేసయ్యా పరాక్రమశాలివని నిను కొనియాడి వేవేల గళములతో కీర్తించి పాడుచూ స్తుతియించెదను యేసయ్య జుంటితేనే ధారలకన్నా మధురమైనది నీ సన్నిధి జీవాహారమై పోషించుచున్నావు నీ సంఘములో నీ మందిరములోనే చిరకాలము జీవించుటే ధన్యత నీ కౌగిలిలో నను ఒఇదిగిపోని యేసయ్య శ్రేష్టమైన ప్రతి ఈవియును పరిశుద్ధమైన ప్రతి వరమును ఆత్మలో వర్ధిల్లి సౌఖ్యముగ ఉండుటకు దయచేయుటకు నీవే సమర్థుడవు నా యేసయ్యా త్వరగా రమ్ము దేవా ప్రతి బాష్పబిందువును తుడుచుటకు నీ కొరకే నిలిచియుందును నీ సంఘములో సర్వ సత్యములో నేనడుచుటకు ఉపదేశక్రమమును యిచ్చితివి మూర్ఖులైన ఈ తరమువారికి వేరై బ్రతుకుటకు రక్షణనిచ్చావు ప్రాణేశ్వర యేసయ్యా నీ కృప నన్ను ఎన్నడు విడువక నా జీవనాధారమై నిలిచెను నీ కృపయే


Follow Us