LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా


బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
నిలవాలని ఉన్నా నిలవలేకున్నా (2)
చూడాలని ఉన్నా చూడలేకున్నా
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా
దరి చేర్చుమో నన్నయ్యా (2)            ||బ్రతకాలని||

కాపరి లేని గొర్రెనైతి
కాటికి నే చేరువైతి
కావలి లేని తోటనైతి
కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి
గుండె పగిలిన ఎకాకినైతి
గుండె దిగులుగా ఉందయ్యా
గూడు చేర్చుమో యేసయ్యా (2)         ||బ్రతకాలని||

నా ఆశలే అడియాశలై
అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో
తొట్రిల్లెనే నా పయనం
చుక్కాని లేని నావనైతి
గమ్యం తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో యేసయ్యా
గుండె గుడిలో నీవుండయ్యా (2)         ||బ్రతకాలని||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words