
బ్రతికియున్నానంటే నీ కృప
బ్రతికియున్నానంటే నీ కృప - జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు - ఎంత భాగ్యం నిచ్చావు పరిశుద్ధత నాలో లేదు - నీ ప్రేమనూ చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా జీవిత నావ సాగుచుండగా - తుపానులు , వరదలూ విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా - నుపద అంటూ నన్ను నడిపినావు సదా నిన్ను సేవిస్తు సాగిపోయెదా - నీ పాదాల చెంత నే వాలిపోయెదా నా జీవితమంతా ప్రయాసలు పడగా - శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా - ఆప్యాయత చూపి ఆదరించినావు నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది - నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా


Follow Us