LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


భజన చేయుచు


భజన చేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును
వృజనముల పై జయమునిచ్చిన - విజయుడా నిను వేడుకొందు

దివ్యపదవిని విడిచి నీవు - దీనుడవై పుట్టినావు
భవ్యమైన బోధలెన్నో - బాగుగా ధర నేర్పినావు

నరుల గావను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు
పరుడనైన నా కొరకు నీ - ప్రాణము నర్పించినావు

చెడిన వాడనైన నన్ను - జేరదీసి బ్రోచినావు
పడిననాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు

ఎంత ప్రేమ యెంతదయ - యెంత కృప యేసయ్య నీకు
ఇంతయని వర్ణింప నిలలో - నెవనికిని సాధ్యంబు కాదు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words