
భజయింతుము నిను జగదీశా
భజయింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణ కర్త శరణు శరణు మా దేవ యెహోవా - మహిమాన్విత చిర జీవనిధి విమలసె రాపులు- దూత గణంబులు - చూడగలేని తేజోనిధివే మా యఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే ప్రప్రధముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజన యే మా జీవాధారం - జేకొనుమా మా స్తుతి గీతం


Follow Us