
భయము చెందకు భక్తుడా
భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2) భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2) జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2) పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2) నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| చెరసాలలో వేసినా తన దేహమంతా.. గాయాలతో నిండినా (2) పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2) భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము|| ఆస్తి అంతా పోయినా తన దేహమంతా.. కురుపులతో నిండినా (2) అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2) అని యోబు పలుక లేదా ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||


Follow Us