LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మంగళమే యేసునకు


మంగళమే యేసునకు మనుజావతారునకు
శృంగార ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే

పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు
నిరుపమానందునకు నిపమంగళమే

దురిత సంహారునకు - పరసుగుణోదారునకు
కరుణాసంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే

రాజులపై రాజునకు - రవికోటి తేజునకు
బూజార్హ పదాబ్టునకు భువనావన మీకు మంగళమే

సత్యప్రవర్తనకు - సద్దర్మశీలునకు
నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే

యుక్తస్తోత్రార్హునకు - భక్త రక్షామణికి
సత్యపరంజ్యోతియగు సార్వభౌమునకు మంగళమే

పరమపురి వాసునకు - నరదైవ రూపునకు
బరమేశ్వరతనయునకు బ్రణతింతుము నీకు మంగళమే

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words