
మంచి కాపరి మా ప్రభు
మంచి కాపరి మా ప్రభు యేసే - మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి - మరణమన్నను భయములేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే పచ్చికా బయళ్ళలో విశ్రమింపగా - శాంత జలాలచెంత అడుగు వేయగా - చేయి విడువకా తోడు నిలుచును నితి మార్గమందు మమ్ము నడువజేయును అంధకారలోయలో మా పయనంలో - లేదులే మాకే భయం అభయముతానై - ఆదరించెను ఆశీర్వదించెను అన్నితావులందు తానె తోడై యుండెను శత్రువుల మధ్యలో మాకు భోజనం - అభిషేకం ఆనందం కృపాక్షేమం - బ్రతుకు నిండగ పాంగిపొర్లగా మాకు భోజనం - అభిషేకం ఆనందం చిరకాలం ఆయనతో జీవింపగా


Follow Us