
మంచే లేని నా పైన
మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2) ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2) పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2) ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా (2) || మంచే లేని|| లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2) నీదెంత దీన మనస్సు – నా కెంత ఘనత యేసు (2) ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా (2) || మంచే లేని|| చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2) నీ సాటిలేని త్యాగం – నా పాలి గొప్ప భాగ్యం (2) ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా (2) || మంచే లేని||


Follow Us