LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మధురం మధురం


మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2)
దీన మనస్సు – దయ గల మాటలు
సుందర వదనం – తేజోమయుని రాజసం (2)    ||మధురం||

ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని
బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)
నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||

పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు
ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)
ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||

కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను
ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)
జడియకు నీవు మహిమలో నిలుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words