
మధురమైనది నా యేసు ప్రేమ
మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా ఇహలోక ఆశలతో అంధురల నేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా ఎగసి పడే కేరటలను అలలు ముంచివేసినా మరణపు ఛాయలే దరి చేరనీయక కౌగిట దాచిన నీ ప్రేమ మధురం నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణపు ముల్లును విరచిన దేవా జీవము నొసగిన నీ ప్రేమ మధురం


Follow Us