
మనసంతా నీ కోసమే
మనసంతా నీ కోసమే - నా యేసయ్యా మది నిండా నీ రూపమే - నా యేసయ్యా మంచుకన్న చల్లనైనా - మల్లెకన్న తెల్లనైన పాలకన్న స్వచ్ఛమైనదీ - నీ ప్రేమ పాలకన్న స్వచ్ఛమైనది కాలాలు మారినా - కరిగిపోని నీ ప్రేమ కష్టా కడలిలో - కనికరించు నీ ప్రేమ కన్నతల్లి ప్రేమ కన్నా - మిన్న అయిన నీ ప్రేమ ఓ... ఓ... ఓ... ఆ.... ఆ... ఆ... జుంటు తేనె ధారకన్న - మధురమైన నీ ప్రేమ నా ప్రేమ జీవితాన - అనంతమైన నీ ప్రేమా బ్రతుకంత పాడుకునే - అమృతా గీతములం ఓ... ఓ... ఓ... ఆ.... ఆ... ఆ... పరిమళ వెదజెల్లె - పారిజాత పుష్పమా కమ్మనైన భావముతో - జాలువారిన కవితమా బ్రతుకంత పాడుకునే - మధురా గీతములా ఓ.... ఓ... ఓ.. ఆ..... ఆ... ఆ...


Follow Us