LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మనసున్న మంచి దేవా


మనసున్న మంచి దేవా - నీ మనస్సును నాకిచ్చావా
మనసు మలినమైన - నాకై మనిషిగా దిగివచ్చావా
నా మదిని కోవెలగా మలచుకోమయ్య
నా హృదిని రారాజుగా నిలచిపోవయ్య

హృదయము వ్యాధిలో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట - ఎవరి సాధ్యము
మనస్సు మర్మమెరిగిన - మహానీయుడా
మనస్సు మార్చగలిగిన - నిజదేవుడా

చెంచెల మనసాడించు - బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును - తప్పుబాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్య
స్థిరమనస్సులో - నీ దారిలో సాగనిమ్మయా

నిండు మనస్సుతో నిన్ను - ఆశ్రయించితి
దీన మనస్సుతో నీకడ - శిరమువంచితి
పూర్ణశాంతి కలవానిగా - నన్ను కూర్చుము
తరతరములకు క్షేమం - చేకూర్చుము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words