
మనసెరిగిన యేసయ్యా
మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు }2 హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు } 2|| మనసెరిగిన || నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా } 2 సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు } 2|| మనసెరిగిన || వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా } 2 ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు } 2|| మనసెరిగిన || మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా } 2 నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2


Follow Us