
మరలిరండి దైవజనమా
మరలిరండి దైవజనమా - ప్రభుని పిలుపిదే తరలిరండి కూలిపోయిన మన బ్రతుకుల - బలిపీఠములను కట్టగరండి బహుకాలముగా ఆకాశములు - వర్తము నీయక మూయబడెను ఎంత నలిగినను దైవజనమున - ప్రార్ధన దాహము పుట్టకపోయెను సంఘమున మన జీవితములలో - బలిపీఠములె కూలిపోయెను పశ్చాత్తాపులై గత జీవితమును - విడచియు దేవుని వైపుకు మరలి మొదటి ప్రేమ మరల మండించి - దేవుని వాగ్దానము చేపట్టి మేలుకొనుడి మన దేవుని వేడగ - పూనుకొనుడి బలిపీఠము కట్టగ దేవుని తోట మిడతలపాలై - పాడై పోయెను బీడుగ మారెను మత్తులారా మేల్కొనండి - ఉజ్జీవముకై మొరలిడరండి పిలువనంపుడి ప్రార్థనవీరుల - బలిపీఠము కడరోధించండి


Follow Us