
ఆ దరి చేరే దారే కనరాదు
ఆ దరి చేరే దారే కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మ్రోగే ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా విద్య లేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్నో చేసాడు మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు సుడి గాలులేమో వీచెను అలలేమో పైపైకి లేచెను ఆశలన్ని అడుగంటిపోయెను నా జీవితమే బేజారైపోయెను వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా ఎందుకు నీ హృదయాన ఇంత తొందర


Follow Us