
మహాదేవుడా మహోన్నతుడా
మహాదేవుడా మహోన్నతుడా నాయెడల నీకృప ఇంత అధికమా నీప్రాణ త్యాగమును మరువగలనా అపవాది నోటినుండి విడిపించినావయ్యా నాగాయములన్ని కడిగి స్వస్థపరచినావయ్మా నీ కావలికోటకు ననుపిలిచినావు నీ కంటిపాపగా కాచుచుంటివి నాపాపముచేత నేను చచ్చియుండగా నీప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా నీజీవపు కోటకు నను పిలిచినావు సమృద్ధి జీవముతో నింపినావయ్యా మట్టినుండి నన్ను పైకి లేపినావయ్యా నను కడిగి రాజవస్త్రమిచ్చి నావయ్యా నీరాజకోటకు నను పిలిచినావు నీ రాజదండము చాపినావయ్యా క్రమమెరుగని నన్ను నీవు చేరదీసినావయ్యా నీఆజ్ఞల మార్గములో నన్ను నడుపుచుంటివి నీయాజక కోటకు నను పిలచినావు ఉపదేశ క్రమమును నేర్పినావయ్యా


Follow Us