
మహిమ నీకే ప్రభూ
మహిమ నీకే ప్రభూ - ఘనత నీకె ప్రభూ - స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకె ప్రభూ - ఆరాధనా - ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే సమీపింపరాని- తేజస్సు నందు - వశియించు - అమరుండవే శ్రీమంతుడవే - సర్వాధిపతివే - నీ సర్వము - నా కిచ్చితివే ఎంతో ప్రేమించి - నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను - విమోచించితివే ఆశ్చర్యకరమైన - నీ వెలుగులోనికి - నను పిలచి - వెలిగించితివే నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప - ఏర్పరచు కొంటివే రాజులైన యాజక - సమూహముగా - ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధజనమై - నీ సొత్తైన ప్రజగా - నన్ను జేసితివే


Follow Us