LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


మహోన్నతుని చాటున


మహోన్నతుని చాటున నివసించువాడు  - సర్వశక్తుని నీడను 
విశ్రమించువాడు  - ఆయన నాదు - కోటయు నాశ్రయము

నేను నమ్ముకొనిన నా దేవుడవు నీవని - యెహోవాతో విన్నవించితి
ఆయన తన - రెక్కలతో నిను కప్పును - రెక్కలాశ్రయమగును

నీ  ప్రక్కను వేయిమంది పడినను - నీ కుడి ప్రక్కను
పదివేలమంది కూలినను ఆపద - నీ యొద్దకు రాదు

నీవు కన్నులారా చూచుచుండగా - భక్తి హీనులకు
కలుగును ప్రతిఫలము నీ ఆశ్రయము  - యెహోవాయని యెంచితివి 

కాబట్టి నీకు ఏ ఆపదరాదు తెగులు సమీపించదు
నీ మార్గము లన్నిట నిన్ను కాపాడన్ - దూతల కాజ్ఞ విడున్

నీ పాదములకు రాయి తగులకుండ - వారి చేతులతో నిన్ను
యెత్తిపట్టుకొందురు సింహములను - నాగు పాముల తొక్కెదవు

కొదమసింహముల, భుజంగములను నీ వణగ దొక్కెదవు
నన్నతడు ప్రేమించుచున్నాడు గాన నేను - అతని తప్పింతును

నా నామము నెరిగినవాడు గనుక నే ఘనపరచెద నతని
మొర పెట్టగ నతనికి వేగిరమే నేను - ఉత్తరమిచ్చెదను

శ్రమలో నే నతనికి తోడై యుండి - విడిపించెద నతని
దీర్గాయువు చేత తృప్తి పరచి నా - రక్షణ చూపింతును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words